News April 25, 2024

హరీశ్.. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో: సీఎం రేవంత్

image

TG: భూమి బద్దలైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు తన రాజీనామా లేఖను జేబులో రెడీగా పెట్టుకోవాలని అన్నారు. రామప్ప, సమ్మక్క సాక్షిగా తాము ఇచ్చిన మాట తప్పబోమని పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని గుర్తుచేశారు.

Similar News

News November 22, 2025

132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్

image

యాషెస్: తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 2 పరుగులకే ఓపెనర్ క్రాలే వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్టోక్స్ సేన 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్సులో ENG 172 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే.

News November 22, 2025

శబరిమల దర్శనాలు.. కేరళ హైకోర్టు కీలక నిర్ణయం

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్స్‌పై విధించిన <<18335976>>ఆంక్షలను<<>> కేరళ హైకోర్టు సడలించింది. ట్రావెన్‌కోర్ బోర్డు, పోలీస్ చీఫ్ కలిసి రద్దీని బట్టి బుకింగ్స్‌పై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఇటీవల స్పాట్ బుకింగ్స్‌ను 20K నుంచి 5Kకు తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నీలక్కల్ దగ్గర బుకింగ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్ బుకింగ్‌తో రోజూ 70K మందికి దర్శనం కల్పిస్తున్నారు.

News November 22, 2025

ఇనుప తీగల ఉచ్చుతో ఎలుకల నియంత్రణ

image

ఎలుకల నివారణకు ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇనుప తీగలు, వెదురు, తాటాకులతో తయారు చేసిన బుట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఎలుకలను ఆకర్షించడానికి వాటిలో ఉల్లిపాయలు, టమాట, ఎండుచేపలు, బజ్జీలు లాంటివి ఉంచాలి. వీటిని పొలం గట్ల వెంబడి, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వరిలో నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ములు పూర్తై నాట్లు వేసిన నెల వరకు.. కోతల తర్వాత ఏర్పాటు చేస్తే ఎలుకలను సమర్థంగా నివారించవచ్చు.