News July 22, 2024
హరీశ్ బీజేపీలోకి వెళ్లడం ఖాయం: బీర్ల

TG: హరీశ్ రావు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే తిరిగి ఆయనమీదే పడుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. త్వరలోనే హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని బీర్ల జోస్యం చెప్పారు. ఇక కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ విసిరారు.
Similar News
News December 8, 2025
10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
News December 8, 2025
కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.
News December 8, 2025
ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.


