News September 6, 2025

కవిత ఆరోపణల తర్వాత తొలిసారి కేసీఆర్‌తో హరీశ్ భేటీ

image

TG: కవిత సంచలన ఆరోపణల తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు తొలిసారి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. ఇందులో కవిత అంశం చర్చకు వస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా హరీశ్‌పై ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 6, 2025

OFFICIAL: టీమ్ ఇండియాకు నో స్పాన్సర్

image

ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. తాజాగా శుభ్‌మన్ గిల్, శివమ్ దూబే ధరించిన జెర్సీలపై ఎలాంటి స్పాన్సర్ లోగో లేదు. దీంతో జట్టుకు ఎలాంటి స్పాన్సర్ లేరని అధికారికంగా తేలిపోయింది. మరోవైపు ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ అన్ని మ్యాచులు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆడబోమని తెలిపారు.

News September 6, 2025

28న BCCI మీటింగ్.. ప్రెసిడెంట్ ఎన్నికపై చర్చ!

image

రోజర్ బిన్నీ రాజీనామాతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికపై చర్చించేందుకు ఈనెల 28న బోర్డు సమావేశం కానుంది. అలాగే మిగతా పోస్టుల భర్తీపైనా చర్చించనుంది. అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడతారనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా అదేరోజు దుబాయ్‌లో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. దీంతో భారత్ ఫైనల్‌కు వెళ్తే BCCI నుంచి ఎవరూ హాజరుకాకపోవచ్చు.

News September 6, 2025

నిరుద్యోగులకు నెలకు రూ.3,500.. కేంద్రం ఏమందంటే?

image

దేశంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ కేంద్రం నెలకు రూ.3,500 ఆర్థిక సాయం చేయనుందని, అప్లై చేసుకునే విధానం ఇదేనంటూ కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని PIB FactCheck వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇలాంటి పథకాలుంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని పేర్కొంది.