News February 6, 2025
ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Similar News
News April 3, 2026
అన్నామలైకి నో టికెట్.. మైలాపూర్ నుంచి తమిళి సై పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో ఆయనకున్న విభేదాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, సాత్తూర్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్ బరిలో దిగుతున్నారు.<<-se>>#ELECTIONS2026<<>>
News April 3, 2026
ఫుడ్ రేట్లు పెంచారు సరే.. మళ్లీ తగ్గిస్తారా?

సరిపడా వంటగ్యాస్ సిలిండర్లు దొరకట్లేదని, బ్లాక్‌లో అధిక ధరకు కొంటున్నామని చాలా హోటళ్లు ఫుడ్ రేట్లను పెంచేశాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే గ్యాస్ సంక్షోభం తీరిపోతే పెంచిన ధరలను తగ్గిస్తారా? అని సామాన్యులకు సందేహం వస్తోంది. గతంలో కరోనా సమయంలో రేట్లను పెంచారు. ఆ మహమ్మారి వదిలి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అవే ధరలను కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో? COMMENT?
News April 3, 2026
రాజధానిపై వైసీపీకి క్లారిటీ లేదా?

AP: రాజధానిపై YS జగన్, ఆ పార్టీ ముఖ్య నేతల స్టేట్‌మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ‘మావిగన్’ను రాజధాని చేయాలని జగన్ అంటుంటే.. తాము అమరావతికి వ్యతిరేకం కాదని వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర ఎంపీలు చెబుతున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదని, అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో రాజధానిపై వైసీపీకి క్లారిటీ ఉందా? లేదా? అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.


