News December 2, 2024
CM రేవంత్‌పై హరీశ్‌రావు విమర్శలు

TG: గతంలో మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు తాను సీఎం అయ్యాక ఉన్న రైతుబంధు కూడా ఇవ్వట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో BRS సర్వే చేస్తే రేవంత్ విమర్శించారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే ఎలా ఉందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి పండుగపూట మహిళలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.
Similar News
News November 26, 2025
నితీశ్ కుమార్ రెడ్డి.. అట్టర్ ఫ్లాప్ షో!

తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఘోరంగా విఫలం అవుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్‌లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.
News November 26, 2025
వైరల్ అయ్యాక అసభ్యకర మెసేజ్‌లు వచ్చాయి: నటి

ఆకర్షణీయమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాత తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని నటి గిరిజా ఓక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆఫర్లేమీ రాలేదు. కానీ చాలా మంది మెసేజ్‌లు పంపారు. ఒక అవకాశం ఇస్తే మీ కోసం ఏదైనా చేస్తానని.. వాళ్లతో గంట గడిపేందుకు రేటు ఎంతో చెప్పాలని కొందరు అభ్యంతరకర మెసేజ్‌లు పంపారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News November 26, 2025
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్‌గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.


