News August 22, 2025

కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ

image

TG: ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో <<17482025>>విచారణ <<>> జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తదుపరి కార్యాచరణపై హరీశ్ సహా మిగతా బీఆర్ఎస్ నేతలతో గులాబీ దళపతి సమాలోచనలు చేస్తున్నారు.

Similar News

News March 26, 2026

బాలయ్యకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారం

image

టాలీవుడ్ నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ(IFFD) వేడుకల్లో ఆయన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి బాలయ్య చేసిన కృషికి గుర్తింపుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అవార్డుతో సత్కరించారు. ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా ఈ పురస్కారం వరించింది.

News March 26, 2026

గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

image

గర్భిణులు రోజుకి 3.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. తప్పనిసరి పరిస్థితుల్లో 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకున్నా బలహీనత, అలసట, నీరసం వంటివన్నీ వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకోవాలని చెబుతున్నారు.

News March 26, 2026

GET READY: 5PMకు టికెట్స్ సేల్

image

IPL-2026లో భాగంగా ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్స్‌ను SRH యాజమాన్యం ఇవాళ సాయంత్రం 5గంటలకు విడుదల చేయనుంది. District యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ‘SRH’ ట్వీట్ చేసింది. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఆడే తొలి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.