News March 13, 2025

తెలంగాణ భవన్‌కు హరీశ్‌రావు తరలింపు

image

TG: ట్యాంక్‌బండ్‌ పైనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, జగదీశ్ రెడ్డి తదితరులను పోలీసులు అక్కడికి తరలించారు.

Similar News

News March 14, 2025

హిందీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థులకు మరో ఛాన్స్

image

హోలీ పండగ కారణంగా రేపు హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పండగ మార్చి 15న నిర్వహించుకుంటున్నారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్ణయించినా రేపు ఎగ్జామ్ రాయలేని స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News March 14, 2025

ఇవాళ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

image

AP: ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్‌లో బస చేస్తారు.

News March 14, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ.. RECORD VIEWS

image

జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులకు 540 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది రికార్డు అని, ఇందులో 38 శాతం హిందీ వ్యూయర్ షిప్ ఉందని తెలిపింది. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచుకు అత్యధికంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయని వెల్లడించింది. జియోహాట్‌స్టార్‌లో ఒక రోజులో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కూడా ఈ టోర్నీ సమయంలోనే నమోదయ్యారని పేర్కొంది.

error: Content is protected !!