News July 15, 2024
రుణమాఫీ మార్గదర్శకాలపై హరీశ్ రావు అసంతృప్తి

TG: రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘డిసెంబర్ 12, 2018కి ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించడం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనిపిస్తోంది. రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు), పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే’ అని విమర్శించారు.
Similar News
News November 23, 2025
టెక్ దిగ్గజాలందర్నీ ఒక చోటకు చేర్చిన AI

టెక్ బిలియనీర్ల ఫొటోలతో క్రియేట్ చేసిన ‘వన్ ట్రిలియన్ స్క్వాడ్’ AI పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శామ్ ఆల్ట్మన్, జెన్సెన్ హువాంగ్ను ఏఐ సహాయంతో పార్టీలో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. సమాంతర విశ్వంలో ఒక చోట, సరదాగా కలుసుకున్న, వన్ ట్రిలియన్ స్క్వాడ్ సమావేశం అంటూ ఫొటోలకు క్యాప్షన్స్ ఇచ్చారు.
News November 23, 2025
సత్యసాయి ఎప్పటికీ జీవించే ఉంటారు: విజయ్ దేవరకొండ

సత్యసాయి బాబాకు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.
News November 23, 2025
రోజూ నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్తో సతమతమవుతున్న వారికి నవ్వు ఉత్తమ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి, మనసుకు అపారమైన లాభాలు కలుగుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్-2 డయాబెటిస్ను, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు సహజ పెయిన్కిల్లర్లా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.


