News March 29, 2024

హరీశ్‌రావు బీజేపీలో చేరతారు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ఎంపీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు బీజేపీలో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. తామేమీ చేరికల గేట్లు ఎత్తలేదని, ఆ పార్టీ వాళ్లే దూసుకొని వస్తున్నారని తెలిపారు. ఇది కేసీఆర్ నేర్పిన విద్యేనని, చేసిన పాపం ఆయనకే తగులుతోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చిల్లర వ్యవహారమని పేర్కొన్నారు.

Similar News

News February 1, 2026

వీటి ధరలు తగ్గే ఛాన్స్!

image

ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల తయారీకి సంబంధించిన పరికరాలపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో ఈవీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. మైక్రోవేవ్ ఓవెన్ పరికరాలు, సోడియమ్ యాంటీమోనేట్‌‌‌పైనా కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో మైక్రోవేవ్ ఓవెన్స్, సోలార్ గ్లాస్ ధరలు తగ్గనున్నాయి. సీఫుడ్ ధరలు తగ్గనున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, ఏవియేషన్‌కు సంబంధించిన ముడిసరకులపైన కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చింది.

News February 1, 2026

రేర్‌పై మోర్ ఫోకస్.. ఉపయోగాలివే

image

రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్‌పై కేంద్రం మోర్ ఫోకస్ పెట్టిన కేంద్రం.. ఏపీ, ఒడిశా, TN, కేరళకు <<19020730>>ప్రత్యేక కారిడార్స్‌ను<<>> కేటాయించింది. దీనివల్ల EV, IC, స్మార్ట్ ఫోన్స్, టర్బైన్స్, మిసైల్స్, సెమీ కండక్టర్స్‌కు అవసరమైన 17 రకాల అత్యంత అరుదైన ఖనిజాలను ఇక్కడే సేకరించి ప్రాసెస్ చేయనుంది. దీంతో చైనా, USపై ఆధారపడటం తగ్గుతుంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌తో గ్లోబల్ మార్కెట్లో పాగా వేసేందుకు వీలవుతుంది.

News February 1, 2026

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో 50% కట్!

image

సరికొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని FM నిర్మలా సీతారామన్ తెలిపారు. సంస్కరించిన ఈ నియమావళిని రికార్డు టైమ్‌లో పూర్తిచేసినట్టు వెల్లడించారు. సింప్లిఫై చేసిన రూల్స్, ఫామ్స్‌ను త్వరలోనే నోటిఫై చేస్తామన్నారు. వీటికి అలవాటు పడేందుకు ట్యాక్స్ పేయర్లకు సరిపడా టైమ్ ఇస్తామని చెప్పారు. కొత్త చట్టంలో పన్ను రేట్లలో మార్పులుండవని, 50% సెక్షన్లు తొలగించినట్టు వివరించారు.