News November 6, 2024

ఫుడ్ పాయిజన్‌పై హరీశ్ రావు అసత్య ప్రచారం: మంత్రి సీతక్క

image

TG: ఆసిఫాబాద్(D) వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు మానుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు. బాధిత విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోలేదని <<14536029>>మాజీ మంత్రి హరీశ్ రావు <<>>అసత్య ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తానే స్వయంగా అధికారులతో సమన్వయం చేస్తూ తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థినులకు అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించినట్లు సీతక్క వెల్లడించారు.

Similar News

News February 6, 2026

ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

థైరాయిడ్ గ్రంథి పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి, మానసిక, ఎదుగుదల లోపాలు వంటివి కనిపిస్తాయంటున్నారు నిపుణులు. పాలు, ఎండుద్రాక్ష, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News February 6, 2026

పాక్‌లో బాంబు దాడి.. 69కి చేరిన మృతులు

image

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19067266>>సూసైడ్ బాంబింగ్‌లో<<>> మృతుల సంఖ్య 69కి చేరింది. మరో 170 మంది తీవ్రంగా గాయపడ్డట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడికి అఫ్గానిస్థానే కారణమని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాకుతో ఆ దేశంపై దాడి చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాడికి తామే బాధ్యులమంటూ ఏ సంస్థ/వ్యక్తి ప్రకటించలేదు.

News February 6, 2026

తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

image

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.