News April 3, 2024

గ్యారంటీల అమలుపై సీఎంకు హరీశ్ రావు లేఖ

image

TG: గ్యారంటీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని.. రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఒక్క రైతుకూ రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. పంట మద్దతు ధరపై రూ.500 బోనస్‌తో పాటు, ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరారు.

Similar News

News April 4, 2026

NLG: అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత

image

నల్గొండ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. నల్గొండ, దేవరకొండలో ఎస్ఎఫ్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఓ/ఎస్ఎఫ్ఓ ఖాళీలు నల్గొండలో 1, నకిరేకల్‌లో 2, హాలియాలో 1 ఉన్నాయి. ఫైర్‌మెన్ (ఎఫ్‌ఎం) పోస్టులు దేవరకొండ, నకిరేకల్‌లో 4 చొప్పున, మిర్యాలగూడలో 3, హాలియాలో 2 ఖాళీగా ఉన్నాయి. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే ముప్పు ఉన్నందున వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News April 4, 2026

మా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. కమల్‌కు కొత్త తలనొప్పి

image

TN అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్ హాసన్‌కు పార్టీ నాయకులు షాక్ ఇస్తున్నారు. పోటీకి దరఖాస్తు సందర్భంగా తమ వద్ద తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలంటున్నారు. తొలుత MNM ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పడంతో 60 మంది రూ.50వేల చొప్పున పార్టీకి చెల్లించి అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కమల్ పోటీ నుంచి దూరంగా ఉంటామని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

News April 4, 2026

ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

image

ప్రతి ఇంట్లో దాదాపు మహిళలే పూజలు చేస్తుంటారు. కానీ సంకల్ప శ్లోకాలు “ధర్మపత్ని సమేతస్య” అని చెబుతాయి. అంటే భార్య సమేతంగా భర్తే పూజలో ప్రధానం అని అర్థం. భర్త క్షేమం కోసం భార్య చేసే పూజలు మినహా నిత్య పూజలు, ఇతర వ్రతాలను ఇద్దరు కలిసి చేస్తేనే అత్యుత్తమ ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. దీపం వెలిగించడం, సంకల్పం చేయడం, ప్రధాన పూజాచర్యలు నిర్వహించాల్సిన బాధ్యత భర్తదే అని చెబుతున్నారు.