News December 6, 2024

హరీశ్ రావు మానసిక స్థితి బాలేదు: కోమటిరెడ్డి

image

TG: మాజీ మంత్రి హరీశ్ రావు మానసిక స్థితి బాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓ చిల్లర MLA గురించి ఇంత డ్రామా అవసరమా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఏ హోదాలో హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారని అడిగారు. ‘మేం ఉద్యమాల నుంచి వచ్చిన MLAలం. వీధి నాటకాల MLAలు మీరు’ అని మండిపడ్డారు. శాంతిభద్రతల సమస్య తేవాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు.

Similar News

News December 29, 2025

ఢిల్లీ హైకోర్టుకు Jr.NTR స్పెషల్ థాంక్స్

image

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు ప్రొటెక్టివ్ ఆర్డర్ పాస్ చేసిన ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు, వాణిజ్య అవసరాలకు అనుమతి లేకుండా తమ ఫొటోలు వాడటంపై పవన్ కళ్యాణ్, <<18640929>>Jr.NTR<<>> ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లను వేసిన విషయం తెలిసిందే.

News December 29, 2025

వీరిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకం!

image

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి కోసం అందించే వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. లక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. అర్హులైన వారు వివాహమైన ఏడాదిలోపు <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేయాలి. జిల్లా కలెక్టర్ ఆమోదంతో సంక్షేమ అధికారులు ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. SHARE IT

News December 29, 2025

VHT: థర్డ్ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ

image

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ థర్డ్ మ్యాచ్ ఆడటం కన్ఫర్మ్ అయింది. బెంగళూరులో 2026 JAN 6న రైల్వేస్‌తో మ్యాచులో విరాట్ ఆడుతారని DDCA ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ప్రకటించారు. న్యూజిలాండ్ సిరీస్‌కు వడోదరలో ODI టీమ్ JAN 8లోపు ట్రైనింగ్ కోసం వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో 6న బెంగళూరులో ఆడి 7న అక్కడ రిపోర్ట్ చేస్తారని సమాచారం.