News September 1, 2025

అంతర్గత కలహాలతోనే హరీశ్‌ను టార్గెట్ చేశారు: మహేశ్ కుమార్

image

TG: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టమైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘తప్పు కేసీఆర్ చేశారా? హరీశ్ రావు చేశారా? అనేది అనవసరం. స్కామ్ జరిగిందని స్పష్టమైంది. మామా అల్లుళ్ల వాటా ఎంతో తేలాలి. కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కు చేరింది. కుటుంబ తగాదాలను కాంగ్రెస్‌పై రుద్దడమేంటి? అంతర్గత కలహాలతోనే హరీశ్ రావును టార్గెట్ చేశారు’ అని అన్నారు.

Similar News

News September 4, 2025

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. సీఎం కీలక నిర్ణయం

image

AP: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాంటి పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారథి ఉంటారు. తప్పుడు పోస్టుల నివారణ, బాధ్యులపై కఠిన చర్యలకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కమిటీ సూచనలు చేయనుంది.

News September 4, 2025

AP క్యాబినెట్‌ నిర్ణయాలు ఇవే

image

* 5జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులకు ఆమోదం
* వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
* గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ, పర్యవేక్షణ పాలసీపై చర్చ
* కుప్పంలో రూ.586 కోట్లతో హిందాల్కో పరిశ్రమకు ఆమోదం
* ప్రైవేటు వర్సిటీల చట్టంలో పలు సవరణలకు గ్రీన్ సిగ్నల్
* SIPB, CRDA నిర్ణయాలకు ఆమోదం
* SEP 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.

News September 4, 2025

OTTలోకి రజినీకాంత్ ‘కూలీ’.. ఎప్పుడంటే?

image

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.