News December 29, 2024
సీఎం రేవంత్‌కు హరీశ్ బహిరంగ లేఖ

TG: కంది రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు CM రేవంత్‌కి లేఖ రాశారు. ‘మేనిఫిస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కందులకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.400 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి ఊసు లేదు. రైతులు ప్రతి క్వింటాలు కందులకు రూ.800 నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి, మద్దతుధరను రైతులకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.
News November 13, 2025
నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఉమర్‌కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.
News November 13, 2025
NIT వరంగల్ 45పోస్టులకు నోటిఫికేషన్

<


