News October 5, 2024
రికార్డు సృష్టించిన హర్మన్ ప్రీత్

మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక ఎడిషన్లకు కెప్టెన్సీ చేసిన భారత కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పారు. ఆమె ఇప్పటివరకు 4 ఎడిషన్లలో (2018, 2020, 2023, 2024) టీమ్ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆమె తర్వాత మిథాలీ రాజ్(2012, 2014, 2016), జులన్ గోస్వామి (2009, 2010) ఉన్నారు.
Similar News
News October 17, 2025
HUDCOలో 79 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) 79 మేనేజర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, CA/CMA, LLB, LLM, MBA, PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://hudco.org.in/
News October 17, 2025
తాజా సినీ ముచ్చట్లు

*బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కంధపురి’ ఇవాళ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
*ఈనెల 31న విడుదలయ్యే ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 3 గంటల 44 నిమిషాల రన్టైమ్ను లాక్ చేశారు.
*ఇవాళ ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దేనికి వెళ్తున్నారు?
News October 17, 2025
విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

AP: నిర్మాణ సంస్థ కె.రహెజా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. IT సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. రూ.2,172కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, మధురవాడలో 27 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 9,681మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇటీవల విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.