News April 7, 2025

ఇంగ్లండ్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

image

ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ నియమితులయ్యారు. జోస్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఈసీబీ బ్రూక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా దేశం కోసం ఆడేందుకు బ్రూక్ ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. కానీ అనూహ్యంగా ఆయన ఐపీఎల్ నుంచి వైదొలిగారు.

Similar News

News April 8, 2025

IPL: పోరాడి ఓడిన ముంబై

image

వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ(29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్య(15 బంతుల్లో 42) వీరోచిత పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4 వికెట్లు, దయాల్, హేజిల్‌వుడ్ చెరో 2, భువీ ఒక వికెట్ తీశారు.

News April 8, 2025

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

image

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో రా.9.35కు ట్రైన్ బయలు దేరనుండగా.. శని, సోమ వారాల్లో సా.4.35కు తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు వెళ్లనుంది. ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

News April 8, 2025

పడుకునే ముందు వీటిని తింటున్నారా?

image

రాత్రి పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలు తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్ర, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్‌తో చేసే శాండ్ విచ్, పిజ్జా తింటే కడుపులో మంట పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. బిర్యానీ, స్వీట్లు, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మకాయలు తినకూడదు. కెఫిన్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలు. రాత్రి ఆహారం 7 గంటలలోపు తినడం ఉత్తమం.

error: Content is protected !!