News March 10, 2025

IPL-2025 నుంచి వైదొలిగిన హ్యారీ బ్రూక్

image

ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ తాను IPL-2025లో ఆడటం లేదని ప్రకటించారు. దేశానికి ఆడటమే తన ప్రాధాన్యత అని, రాబోయే సిరీస్‌ల కోసం ప్రిపేర్ అయ్యేందుకే IPLకు దూరం అవుతున్నట్లు పేర్కొన్నారు. 2024 వేలంలో అతడిని DC రూ.6.25కోట్లకు కొనుగోలు చేసింది. ఆక్షన్‌లో ఎంపికై టోర్నీలో పాల్గొనకపోతే రెండేళ్ల నిషేధం విధిస్తామని IPL ఇటీవల కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. దీంతో అతడిపై రెండు సీజన్ల పాటు బ్యాన్ ఉండనుంది.

Similar News

News December 5, 2025

గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

image

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.

News December 5, 2025

భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

image

ఇండిగో విమానాలు <<18473431>>రద్దు<<>> కావడంతో మిగతా ఎయిర్‌లైన్స్ ఈ సందర్భాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. వివిధ రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచాయి. హైదరాబాద్-ఢిల్లీ ఫ్లైట్ టికెట్ రేట్ రూ.40వేలకు చేరింది. హైదరాబాద్-ముంబైకి రూ.37వేలుగా ఉంది. సాధారణంగా ఈ రూట్ల టికెట్ ధరలు రూ.6000-7000 మధ్య ఉంటాయి. అటు ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు కూడా అమాంతం పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

News December 5, 2025

డబ్బులు రీఫండ్ చేస్తాం: IndiGo

image

విమాన సర్వీసుల రద్దుపై ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య టికెట్ బుక్ చేసుకొని, రద్దు లేదా రీషెడ్యూల్ చేసుకున్నవారికి ఫుల్ రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. ఎయిర్‌పోర్టుల్లో ఉన్నవారందరినీ సేఫ్‌గా చూసుకుంటామని, ఇబ్బందిపడుతున్న వారికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. వేల సంఖ్యలో హోటల్ గదులు, రవాణా, ఫుడ్, స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.