News August 27, 2024

నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జల

image

AP: తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ముంబై నటికి వేధింపుల కేసులో తన పేరు ప్రస్తావించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు TDP అసత్య కథనాలను రాయిస్తోంది. YCP నేతల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తోంది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.

News November 22, 2025

ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

News November 22, 2025

రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

image

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.