News October 9, 2024
ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా

వివాదంలో చిక్కుకున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అండగా నిలిచారు. తాను చిన్న దూరాలు ప్రయాణించేందుకు ఓలా స్కూటర్‌నే వినియోగిస్తానంటూ ట్వీట్ చేశారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు, ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్‌కు మధ్య నెట్టింట వాగ్వాదం అనంతరం కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(CCPA) ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు సంస్థ షేర్లు సైతం 9శాతం పడిపోయాయి.
Similar News
News January 7, 2026
అంబర్నాథ్ అలయన్స్.. హైకమాండ్స్ ఆగ్రహం

అంబర్నాథ్ (MH) మున్సిపాలిటీలో స్థానిక <<18786772>>BJP-కాంగ్రెస్<<>> కలిసిపోవడంపై ఇరు పార్టీల నాయకత్వాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ ప్రాంత పార్టీ చీఫ్ సహా తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఇక లోకల్ BJP నేతల తీరుపై CM దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సీట్ల కౌన్సిల్లో కాంగ్రెస్ 12, BJP-14, NCP (అజిత్)-4 శివసేన (షిండే)-27 పొందగా SSను పక్కనబెట్టి మిగతా పార్టీలు కూటమి ప్రకటించాయి.
News January 7, 2026
దావోస్‌లో ఫోర్త్ సిటీపై సీఎం ప్రజెంటేషన్

TG: దావోస్ పర్యటనలో CM రేవంత్ రెడ్డి ‘World Economic Forum’ సదస్సులో “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారబోతున్నHYD ‘ఫోర్త్ సిటీ’ గురించి ప్రత్యేకంగా వివరించనున్నారు. తెలంగాణ రైజింగ్‌పై సమగ్ర నివేదికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జనవరి 19-23 వరకు ప్రపంచ ఆర్థిక వేదికలో TG పెవిలియన్‌లో ఫోర్త్ సిటీ నమూనాను ప్రదర్శించనున్నారు.
News January 7, 2026
రేపు అంతరిక్షంలోకి నాసా వ్యోమగాములు

ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ కోసం ISS బృందం సిద్ధమైంది. నాసా వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్‌మ్యాన్ రేపు సాయంత్రం 6.30 గంటలకు అంతరిక్ష కేంద్రం వెలుపలికి రానున్నారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగే ఈ ప్రక్రియలో వారు కొత్త సోలార్ ప్యానెల్స్ అమరికకు అవసరమైన కిట్లను ఇన్స్టాల్ చేస్తారు. అలాగే అంతరిక్షంలో సూక్ష్మజీవుల నమూనాలను సేకరించడం వంటి పనులు చేస్తారు.


