News September 25, 2024

డబ్బుల కోసమే నా పై ఆరోపణలు: హర్షసాయి

image

తనపై నార్సింగి పీఎస్‌లో అత్యాచార <<14188760>>కేసు <<>>నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News December 17, 2025

OFFICIAL: నాలుగో టీ20 రద్దు

image

IND-SA నాలుగో T20 రద్దయింది. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యం కాదని ప్రకటించారు. కాగా ఇప్పటికే జరిగిన 3 టీ20ల్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరగనుంది. కాగా లక్నోలో పొగమంచు, పొల్యూషన్ తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ రద్దు అవుతుందని గంట క్రితమే <<18596625>>Way2News అంచనా<<>> వేసింది. ఇప్పుడదే నిజమైంది.

News December 17, 2025

రిజల్ట్స్: కూతురిపై తండ్రి.. తల్లిపై కూతురు విజయం

image

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర విజయాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం(D)లోని పెనుబల్లిలో తల్లి తేజావత్‌పై కూతురు బానోతు పాపా గెలుపొందారు. నారాయణపేటలోని కోల్పూరులో కూతురిపై తండ్రి రాములు 420 ఓట్ల తేడాతో గెలుపొందారు. సొంతింటి వారే ప్రత్యర్థులుగా మారిన ఈ పోరు చర్చనీయాంశంగా మారింది. అటు ఆదిలాబాద్‌(D) బరంపూర్‌లో 69 ఏళ్ల(ఏకగ్రీవం) తర్వాత జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి దేవరావు గెలిచారు.

News December 17, 2025

సర్పంచ్ ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

image

TG: మూడో విడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,502, BRS 866, BJP 163, ఇతరులు 325 చోట్ల గెలిచారు. 26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లో BRS లీడ్‌లో ఉంది. జనగామ, యాదాద్రి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్-BRS మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అటు నిర్మల్ జిల్లాలో బీజేపీ దూసుకెళ్తోంది.