News February 1, 2025

నాలుగో టీ20లో హీరోగా మారిన హర్షిత్

image

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి హీరోగా అవతరించారు. కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టి ఓడిపోయే మ్యాచ్‌ను మలుపు తిప్పారు. బేథేల్, లివింగ్‌స్టోన్, ఓవర్టన్‌లను ఆయన పెవిలియన్ పంపారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏడో ప్లేయర్‌గా రాణా నిలిచారు. గతంలో బ్రయాన్, నీల్ రాక్, జోండో, పార్కిన్‌సన్, కమ్రాన్ గులాం, బహిర్షాలు డెబుట్ చేశారు.

Similar News

News February 1, 2025

నేడే కేంద్ర బడ్జెట్

image

ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్‌లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది.

News February 1, 2025

ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?

image

ఉద్యోగులకు ఏసీ ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం అలవాటైపోయింది. కానీ ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలపాటు ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు పెరగడం, మధుమేహం వస్తుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మెడ, వెన్ను నొప్పి వస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, డిప్రెషన్, అల్జీమర్స్, రక్తపోటు, పక్షవాతం వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

News February 1, 2025

క్యాబ్‌లో సకల సౌకర్యాలు.. అన్ని ఫ్రీనే..!

image

ఢిల్లీలో అబ్దుల్ ఖదీర్ అనే డ్రైవర్ ఉబెర్ క్యాబ్‌లో సౌకర్యాలు చూసి కస్టమర్లు విస్తుపోతున్నారు. బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో ఉండే సౌకర్యాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ఇది ట్యాక్సీ కంటే ఓ లగ్జరీ లాంజ్‌లాగా కనిపిస్తోంది. స్నాక్స్, వాటర్ బాటిల్, మందులు, ఫెర్ఫ్యూమ్స్, ఫ్యాన్, టిష్యూ, శానిటైజర్, వైఫై, యాష్ ట్రే, గొడుగు ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. క్యాబ్ బుక్ చేసుకున్నవారు ఇవన్నీ ఫ్రీగా పొందవచ్చు.