News October 6, 2025

అన్ని ఫార్మాట్లలో హర్షిత్ రాణా.. ఎందుకో?

image

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 స్క్వాడ్‌లో పేసర్ హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. IPLలో KKR తరఫున ఆడటం వల్లే హెడ్ కోచ్ గంభీర్ అతడికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. పర్ఫార్మెన్స్ గొప్పగా లేకపోయినా మూడు ఫార్మాట్లలో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. షమీ, సిరాజ్ లాంటి బౌలర్లు కనిపించట్లేదా అని నిలదీస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 6, 2025

2-5 ఏళ్లలోపు అబ్బాయిలు ఎంత ఎత్తు ఉండాలంటే?

image

పిల్లలు వయసుకు తగ్గట్లు ఎత్తు పెరుగుతున్నారా.. లేదా అని చెక్ చేస్తున్నారా? WHO సిఫార్సు ప్రకారం రెండేళ్ల అబ్బాయి సగటున 87.1 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే 28 నెలలు- 90.4, 30 నెలలు- 91.9, 35 నెలలు- 95.4, 40నెలలు- 98.6, 45నెలలు – 101.6, 50నెలలు- 104.4, 55నెలలు- 107.2, 5వ బర్త్ డే కల్లా పిల్లాడు 110.0cmsల ఎత్తు ఉండాలి. పిల్లాడి ఎత్తుపై సందేహముంటే వైద్యులను సంప్రదించాలి. Share it

News October 6, 2025

రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ వర్సిటీలో 47 పోస్టులు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 47 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MBA, PGDM, CA, B.E, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://rgnau.ac.in/

News October 6, 2025

వంటింటి చిట్కాలు

image

* ఇన్‌స్టంట్‌ కాఫీపౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలంటే గాలి తగలని డబ్బాలో వేసి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచితే ఎంత కాలమైనా ఉంటుంది.
* కోడిగుడ్డు సొనలో కొద్దిగా నీళ్లు కలిపి వేస్తే ఆమ్లెట్‌ మెత్తగా వస్తుంది.
* గ్లాస్‌లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోతే..పై గ్లాసును చల్లటి నీటితో నింపి, వేడినీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది.
<<-se>>#VantintiChitkalu<<>>