News February 6, 2025

హర్షిత్ రానా అరుదైన రికార్డు

image

భారత యువ పేసర్ హర్షిత్ రాణా భారీగా పరుగులిస్తున్నా వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, ODI, టీ20) డెబ్యూ మ్యాచుల్లో మూడేసి వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పారు. టెస్టులో AUSపై 3/48, టీ20లో ENGపై 3/33, ODIలో ENGపై 3/53 వికెట్లతో రాణించారు. అలాగే వన్డేల్లో డెబ్యూ మ్యాచులో ఒకే ఓవర్లో అత్యధిక రన్స్ (26) సమర్పించుకున్న భారత బౌలర్‌గా నిలిచారు.

Similar News

News February 6, 2025

BREAKING: భారత్ విజయం

image

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.

News February 6, 2025

ఏనుగులూ పగబడతాయ్!

image

పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.

News February 6, 2025

భారత క్రికెట్‌కు లతా మంగేష్కర్ సాయం

image

గాన కోకిల లతా మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె టీమ్ఇండియాకు చేసిన సహాయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జట్టు కోసం నిధుల సేకరణ కోసం ఢిల్లీలో 1983లో కన్సర్ట్ నిర్వహించారు. ఆమె సోదరుడు పండిత్ హృద్యనాథ్ స్వరపరిచిన ‘భారత్ విశ్వ విజేత’ సాంగ్‌ను లతా పాడారు. దీనికి కపిల్ దేవ్ టీమ్‌, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హాజరయ్యారు. వచ్చిన రూ.20లక్షలను ఆమె ప్లేయర్లకు అందించారు.

error: Content is protected !!