News October 9, 2024
హరియాణా, ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటే: జగన్
AP: హరియాణా ఎన్నికలు కూడా AP తరహాలోనే జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనే బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. మనం కూడా అదే విధానానికి వెళ్లడం మంచిది. ఓటర్లలో విశ్వాసం నింపేందుకు న్యాయనిపుణులు ముందుకు రావాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 21, 2024
ముదురుతున్న శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల వ్యవహారం
BRS నేత <<14920837>>శ్రీనివాస్ గౌడ్<<>> వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. ఆయనపై కేసు నమోదు చేయాలని TTD భావిస్తోంది. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలను విజిలెన్స్ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24న జరిగే TTD బోర్డు సమావేశంలో దీనిపై చర్చిస్తారని టాక్. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News December 21, 2024
పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి
AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.
News December 21, 2024
పాతబస్తీలో చ.గజానికి రూ.81వేలు ఇస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి
TG: పాతబస్తీలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విస్తరణపై ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రచిస్తోందని, త్వరలోనే సీఎం పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. పాతబస్తీలో మెట్రో మార్గం కోసం 1100 ఆస్తులను సేకరిస్తున్నామని, చదరపు గజానికి రూ.81వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిర్వాసితులకు చెక్కులు ఇచ్చి, నిర్మాణాలను తొలగిస్తామని వెల్లడించారు.