News October 4, 2024
రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

హరియాణా అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. 73 జనరల్ స్థానాలు, 17 ఎస్సీ రిజర్వ్ స్థానాలు కలిపి మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 14 లక్షల మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాస్తవానికి హరియాణా ఎన్నికలు అక్టోబర్ 1న జరగాల్సి ఉన్నా కొన్ని పార్టీల విజ్ఞప్తితో EC 5కు వాయిదా వేసింది.
Similar News
News March 4, 2025
సీఎం రేవంత్‌కు పాలన చేతకావట్లేదు: ఎంపీ లక్ష్మణ్

TG: KCR చేసిన తప్పిదాలే సీఎం రేవంత్ చేస్తున్నారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. BRS చీఫ్‌కు పట్టిన గతే ఈయనకూ పడుతుందని జోస్యం చెప్పారు. MLC ఎన్నికలు ఇందుకు నాంది అని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ముసుగులో BRS నేతలు లబ్ధి పొందారని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీఎంకు పాలన చేతకాక గందరగోళంతో రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారని ఫైరయ్యారు.
News March 4, 2025
INDvAUS: భారత్ బౌలింగ్.. జట్లు ఇవే

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. జట్లు ఇవే.
భారత జట్టు: రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్‌దీప్, వరుణ్
ఆస్ట్రేలియా జట్టు: కనోలీ, హెడ్, స్మిత్, లబుషేన్, ఇంగ్లిస్, కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, ఎల్లిస్, జంపా, సంఘా
News March 4, 2025
INDvAUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.