News October 8, 2024
హరియాణా: బీజేపీ లేదంటే కాంగ్రెస్.. లోకల్ పార్టీలకు ఓటర్లు నై.. నై!

హరియాణా ఓటర్లు ఈసారి సుస్పష్టమైన తీర్పునిచ్చారు. రాజకీయ సమీకరణాల్లో స్థానిక పార్టీలకు చోటివ్వలేదు. జాతీయ పార్టీలకే పట్టం కట్టారు. గందరగోళానికి తావులేకుండా ఏదో ఒకవైపే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్కు ఓటేశారు. EC ప్రకారం ఈ 2 పార్టీలే 81% ఓట్షేర్, 84 సీట్లను పంచుకున్నాయి. INLD, BSP చెరోసీటు, ఇండిపెండెంట్లు 10% ఓట్షేర్తో 4 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. JJP జాడే లేదు.
Similar News
News November 14, 2025
పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


