News October 9, 2024

Haryana: ఓడిస్తారనుకున్న జాట్లే BJPని గెలిపించారు

image

హరియాణాలో BJP చావుదెబ్బ తింటుందని అనేక థియరీలు ప్రచారమయ్యాయి. 27% జనాభాతో ప్రబలశక్తిగా ఉన్న జాట్లు ఆ పార్టీపై కోపంతో ఉన్నారని యోగేంద్రయాదవ్ వంటి విశ్లేషకులు గట్టిగా చెప్పారు. తీరాచూస్తే ఓడిస్తారనుకున్న జాట్లే BJPకి ఓటేసి గెలిపించడం విశేషం. మొత్తం 90లో 36 నియోజకవర్గాల్లో వారిదే ఆధిపత్యం. అందులో కాంగ్రెస్ 18, BJP 16, ఇతరులు 2 గెలవడం గమనార్హం. 30 SC సెగ్మెంట్లలో కాంగ్రెస్ 16, BJP 13 గెలిచాయి.

Similar News

News October 19, 2025

UKలో ఉండటంపై విరాట్ ఏమన్నారంటే?

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొన్ని నెలలుగా ఫ్యామిలీతో కలిసి UKలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ్టి మ్యాచ్‌కు ముందు ఆయన స్పందించారు. ‘టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత నాకు చాలా సమయం దొరికింది. జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతున్నా. ఇది ఒక అందమైన దశ. చాలా ఆనందంగా ఉన్నా. ఫ్రెష్‌గా, ఫిట్‌గా ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు.

News October 19, 2025

గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

image

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.

News October 19, 2025

JEE మెయిన్-2026 షెడ్యూల్ వచ్చేసింది

image

JEE MAIN-2026 <>షెడ్యూల్‌<<>>ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. సెషన్ 1 దరఖాస్తులను ఈ నెల నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది. 2026 జనవరి 21 నుంచి 30వ తేదీల మధ్య పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి నెలాఖరు నుంచి సెషన్-2 అప్లికేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 1-10 మధ్య ఎగ్జామ్ ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం JEE MAIN వెబ్‌సైట‌్‌ను సందర్శించండి.