News September 28, 2024

హరియాణా కాంగ్రెస్ పూర్తి స్థాయి మ్యానిఫెస్టో

image

హ‌రియాణా ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ పూర్తిస్థాయి మ్యానిఫెస్టో ప్రకటించింది. మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్టబ‌ద్ధ‌త స‌హా రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచితంగా చికిత్స అందిస్తామంది. పింఛ‌న్ రూ.6 వేల‌కు పెంపు *18-60 ఏళ్ల మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2 వేలు *2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు *రైతు క‌మిష‌న్ ఏర్పాటు *ఓబీసీల‌కు రూ.10 ల‌క్ష‌ల‌కు క్రిమీలేయ‌ర్ పెంపు *అమరవీరుల కుటుంబాలకు రూ.2 Cr *రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలిచ్చింది.

Similar News

News October 15, 2024

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు

image

AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.

News October 15, 2024

కెన‌డాతో ఇక క‌టిఫ్‌.. ఎన్నిక‌ల వ‌ర‌కు ఇంతేనా!

image

భార‌త్‌-కెన‌డా మ‌ధ్య వివాదాలు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా కనిపించ‌డం లేదు. ట్రూడో ప్రభుత్వ ఖలిస్తానీ వేర్పాటువాద అనుకూల విధానాలపై ఆగ్రహంగా ఉన్న భారత్ అక్కడి దౌత్య‌వేత్త‌ల‌ను వెన‌క్కి పిలిపించింది. అలాగే ఇక్క‌డి కెన‌డా దౌత్య‌వేత్త‌ల‌ను బ‌హిష్క‌రించింది. కెనడాలో వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కెనడా వైఖరి మారితేనే దౌత్య బంధాలపై స్పష్టతరానుంది.

News October 15, 2024

అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1987: హీరో సాయి ధరమ్ తేజ్ జననం
1994: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం