News October 9, 2024
Haryana: జిల్లాలకు జిల్లాలే క్లీన్‌స్వీప్ చేసిన BJP
హరియాణాలో BJP చాలా జిల్లాల్లో క్లీన్‌స్వీప్, కొన్నింట్లో ఒకటి మినహా అన్ని స్థానాలూ గెలిచింది. కర్నాల్ 5/5, పానిపత్ 4/4, భివానీ 3/3, ఛర్ఖీదాద్రీ 2/2, రెవారి 3/3, గుర్గావ్ 4/4తో ప్రత్యర్థిని ఖాతా తెరవనివ్వలేదు. సోనిపత్ 4/5, జింద్ 4/5, మహేంద్రగఢ్ 3/4, పల్వాల్ 2/3, ఫరీదాబాద్‌లో 5/6తో అదరగొట్టింది. రోహ్తక్ 4/4, జాజర్ 3/4, ఫతేబాద్ 3/3, కురుక్షేత్ర 3/4, కతియాల్ 3/4లో కాంగ్రెస్ సత్తా చాటింది.
Similar News
News January 3, 2025
ఈ నెల 28 నుంచి నాగోబా జాతర
TG: రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగే కెస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఆలయంలో 150మంది ఆదివాసీ యువత రక్తదానం చేసి జాతరకు అంకురార్పణ చేశారు. నాగోబా జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా గిరిజనులు తరలిరానున్నారు.
News January 3, 2025
దీపాదాస్ మున్షీని మార్చనున్న AICC?
TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉందా? ఆమెను తప్పించాలని భావిస్తోందా? గాంధీభవన్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వ్యవహరించే తీరు బాగాలేదని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News January 3, 2025
వచ్చేవారం భారత్‌కు జేక్ సలివాన్
US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ వచ్చేవారం భారత్‌కు రానున్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(iCET) ప్రగతిని ఆయన పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. AI, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, రక్షణ ఆవిష్కరణల రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఐసెట్‌ను భారత్, అమెరికా ప్రారంభించాయి. కాగా.. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సలివాన్ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.