News March 27, 2025
ఫొగట్కు 3 ఛాయిస్లిచ్చిన హరియాణా ప్రభుత్వం!

భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ MLA వినేశ్ ఫొగట్కు క్రీడా విధానం కింద ఇచ్చే ప్రయోజనాలను హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆమె ఎమ్మెల్యే కావడంతో 3 ఛాయిస్లు ఇస్తున్నట్లు పేర్కొంది. రూ.4కోట్ల నగదు, హరియాణా షహ్రీ వికాస్ ప్రాధికార్ (HSVP) కింద ప్లాట్ లేదా గ్రూప్-A ఉద్యోగంలో ఏదైనా ఒకటి ఇస్తామంది. అయితే ఈ మూడింటిలో ఏది కావాలో చెప్పాలని కోరగా, ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Similar News
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.
News November 27, 2025
పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>


