News October 8, 2024
HARYANA: ఈ అంశాలు కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయాయి!

పదేళ్లు అధికారంలో ఉన్న BJPపై ప్రజల్లో వ్యతిరేకత *సాగు చట్టాలను నిరసిస్తూ రైతుల ఉద్యమాలు *వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనలు * అగ్నివీర్‌పై స్థానిక యువతలో ఉన్న అసంతృప్తి *జాట్‌ల మద్దతు *కులగణన *దళిత వర్గాల ఓట్ల కన్సాలిడేషన్ * నిరుద్యోగం *లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన. వివిధ అంశాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోయాయి.
Similar News
News March 5, 2026
బెంగాల్ గవర్నర్ రాజీనామా

వెస్ట్ బెంగాల్ గవర్నర్ పదవికి సీవీ ఆనంద్ బోస్ రిజైన్ చేశారు. తన రాజీనామా లెటర్‌ను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. అయితే దీనికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోస్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర గవర్నర్‌గా ఆయన మూడున్నరేళ్లు పని చేశారు. మరోవైపు లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.
News March 5, 2026
వాహనాలపై కొత్తగా రహదారి భద్రతా సెస్: మంత్రి

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు GOVT కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కొత్తగా 10% రహదారి భద్రతా సెస్‌ను విధించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్‌తో పాటు దీన్ని వసూలు చేస్తారు. ఏడాదికి ₹270CR వస్తుంది. రహదారి భద్రతా సదుపాయాలు, బ్లాక్‌స్పాట్ల మెరుగుదలకు దీన్ని వినియోగిస్తాం’ అని తెలిపారు. ఈమేరకు సవరణ బిల్లును మంత్రి సభలో ప్రవేశపెట్టారు.
News March 5, 2026
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.. లిమిట్ దాటితే!

కొందరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. కానీ IT చట్టం ప్రకారం లిమిట్ దాటితే అధికారులు నోటీసులు పంపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10L కంటే క్యాష్ డిపాజిట్ చేసినా అధికారులు ఐటీ శాఖకు ఇన్ఫార్మ్ చేస్తారు.₹10L కంటే విలువైన విదేశీ వస్తువులు, ప్రయాణాలు చేసినా ఐటీ క్వశ్చన్ చేస్తుంది. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లులు ఉన్నా నోటీసులు రావొచ్చు.


