News November 21, 2024

మద్యం నేడు అమృతంగా మారిందా?: రాచమల్లు

image

AP: వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని వైసీపీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.

Similar News

News October 27, 2025

‘డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

image

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం సైబర్ క్రైమ్ నిపుణులు, వసతులు కావాలంటే చెప్పాలని CBIకి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

News October 27, 2025

సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

image

AP: రాష్ట్రానికి మొంథా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో CM CBNతో PM మోదీ ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PMOతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు CM సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ గట్లు పటిష్ఠం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, CS తదితరులు పాల్గొన్నారు.

News October 27, 2025

మొదటి అడుగు సులభం కాదు.. కానీ: ఆనంద్

image

ఎన్నో అడ్డంకులను అధిగమించి తవాంగ్‌కు చెందిన టెన్జియా యాంగ్కీ IPSలో చేరిన తొలి అరుణాచల్‌ప్రదేశ్‌ మహిళగా చరిత్ర సృష్టించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె ప్రయాణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘మొదటి వ్యక్తి కావడం ఎప్పుడూ సులభం కాదు. ఆమె వేసిన గెలుపు బాటలో ఎంతో మంది యువతులు పయనిస్తారు’ అని కొనియాడారు. ఇది తన ‘Monday Motivation’ అని రాసుకొచ్చారు.