News June 17, 2024
స్పీకర్‌గా అయ్యన్న పేరు ఖరారు?

AP: అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైందా..? ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అది నిజమేనంటూ ఆయనే ధ్రువీకరించారని అయ్యన్న సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Similar News
News November 10, 2025
కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.
News November 10, 2025
సోమవారం శివారాధన ఎందుకు చేయాలి?

శివారాధనకు సోమవారం అత్యంత విశిష్టమైన రోజు. మిగిలిన రోజులకంటే ఈరోజు శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్మకం. స్కంద పురాణం ప్రకారం.. శివుడు తన శిరస్సుపై సోముడిని ధరిస్తాడు కాబట్టే ఈ వారానికంత ప్రాధాన్యం. జాతకంలో శని దోషాలున్నవారు నేడు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని, రుద్ర మంత్రంతో శివునికి అభిషేకం చేయాలట. ఇలా 11 సోమవారాలు చేస్తే బాధలు తగ్గి, సత్వర ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
News November 10, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో దివంగత సింగర్ ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆయన కుమారుడు చరణ్ ఆవిష్కరించారు.
* PPP విధానంలో ప్రజలపై భారం పడకుండా పలు కీలక రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.2,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
* పట్టణాల్లోని వ్యాపార భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ECBC) అమలులో దేశంలోనే AP అగ్రస్థానంలో నిలిచింది.


