News August 26, 2024

కాంగ్రెస్ OPS అస్త్రాన్ని BJP న్యూట్రలైజ్ చేసిందా?

image

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌పై అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. BJP హఠాత్తుగా దీన్నెందుకు తెచ్చిందో అర్థం కాలేదు. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో OPSను కాంగ్రెస్ ప్రధాన అస్త్రంగా మలిచి లాభపడింది. ప్రస్తుతం JK, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు, OPS అస్త్రాన్ని నిర్వీర్యం చేసేందుకే BJP ఇలా UPS తెచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం.

Similar News

News December 3, 2025

పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News December 3, 2025

నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

image

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

News December 3, 2025

ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

image

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.