News August 26, 2024
పార్టీని నడపటం స్టాలిన్కు కష్టంగా మారిందా?

DMK అంతర్గత పరిస్థితి పైకి చూస్తున్నంత సాఫీగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీని పట్టుకొని వేలాడుతున్నాడంటూ ఏడుసార్లు ఎమ్మెల్యే, ఆరుసార్లు మంత్రి దురైమురుగన్పై నటుడు రజనీకాంత్ వ్యాఖ్యల్నే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కుమారుడు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న స్టాలిన్ కల సాకారం కాకపోవడానికి ఆయనే కారణమని సమాచారం. పైగా DyCM పదవిని ఎవరు కాదనుకుంటారని మురుగన్ మనసులో మాటను బయటపెట్టేశారు.
Similar News
News December 4, 2025
పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.
News December 4, 2025
స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.
News December 4, 2025
అంతరిక్షం నుంచి పవిత్ర మక్కా ఎలా ఉందో చూడండి!

ముస్లింల పవిత్ర నగరం ‘మక్కా’ అద్భుత చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమికి 400KM దూరంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి రాత్రిపూట వ్యోమగామి డాన్ పెటిట్ ఫొటో తీశారు. ‘సౌదీ అరేబియాలోని మక్కా ఆర్బిటల్ వ్యూ ఇది. మధ్యలో వెలిగిపోతున్నది ఇస్లాం పవిత్ర స్థలం కాబా. స్పేస్ నుంచి కూడా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. డాన్ పెటిట్ తన నాలుగో మిషన్లో ISS కుపోలా విండో నుంచి ఈ దృశ్యాన్ని తీశారు.


