News August 3, 2024
భారత్‌పై ప్రకృతి కన్నెర్ర చేసిందా..?
ఈ ఏడాది భారత్‌పై ప్రకృతి కన్నెర్ర చేసినట్లు కనిపిస్తోంది. దేశం నలుదిక్కులా విపత్తులు వణికించాయి. ఇంకా వణికిస్తున్నాయి. ఏపీని వరదలు ముంచెత్తాయి. కేరళలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరద ఊళ్లను తుడిచిపెట్టేసింది. రెమాల్ తుఫానుతో ఈశాన్య రాష్ట్రాలు, బిపర్‌జాయ్ తుఫానుతో గుజరాత్ అతలాకుతలమయ్యాయి. ఢిల్లీ, ముంబై నగరాలు వరదతో విలవిలలాడాయి.
Similar News
News February 3, 2025
అలాగైతే.. పులివెందులకు ఉపఎన్నిక: RRR
AP: MLA ఎవరైనా లీవ్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని Dy. స్పీకర్ రఘురామకృష్ణరాజు(RRR) హెచ్చరించారు. ఒకవేళ మాజీ CM జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉపఎన్నిక వస్తుందని చెప్పారు. ఆయన అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు పంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాను స్పీకర్, CM కాదు ప్రజలు ఇవ్వాలని తెలిపారు. తన కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ పాత్ర స్పష్టమైందన్నారు.
News February 3, 2025
మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ సూపర్ హిట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘గోదావరి’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించగా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. మూవీలోని ‘సీతా మహాలక్ష్మి’ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘గోదావరి’ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారా? లేదా? కామెంట్ చేయండి.
News February 3, 2025
17% పెరిగిన జీఎస్టీ ఆదాయం
తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.