News March 11, 2025

ఫ్రీ బస్ వల్లే మహిళలకు గౌరవం తగ్గిందా?

image

TGSRTCపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ మహిళలు బస్సు ఆపమంటే స్టాప్ లేదని దూరంగా ఆపుతున్నారని, ఎంతో ఇబ్బంది అవుతోందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మహిళలు ఎక్కడ ఆపమన్నా ఆపాలని రూల్ ఉందని, దీన్ని పట్టించుకోవట్లేదని ఫైరవుతున్నారు. కొందరు ఆవేశంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఫ్రీ బస్సు వల్ల మహిళలను గౌరవించట్లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 8, 2025

రెచ్చగొట్టేలా జైశంకర్‌ వ్యాఖ్యలు: పాకిస్థాన్

image

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.

News December 8, 2025

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 8, 2025

నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్.. విశేషాలివే!

image

TG: గ్లోబల్ సమ్మిట్-2025ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ ఇవాళ 2PMకు ప్రారంభిస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.