News February 15, 2025
ఆ రోజు నుంచి మలయాళ సినీ ఇండస్ట్రీ క్లోజ్?

మలయాళ సినిమా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి పరిశ్రమను మూసివేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అధిక పన్నులు, నటీనటులు రెమ్యునరేషన్ పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ & స్క్రీనింగ్లతో సహా అన్ని చలనచిత్ర కార్యకలాపాలను నిలిపివేస్తామని వెల్లడించారు.
Similar News
News November 21, 2025
రాజధాని రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం: నారాయణ

AP: రాజధానిలో రైతులకిచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. ‘69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 991మంది రైతులకే ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. కొందరు తమకు కావాల్సిన చోట ప్లాట్లు అడుగుతున్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదు. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు.
News November 21, 2025
పిల్లలకు నెబ్యులైజర్ ఎక్కువగా వాడుతున్నారా?

పిల్లల నెబ్యులైజర్లో ఉపయోగించే మందులు సాధారణంగా స్టెరాయిడ్స్ కలిగి ఉంటాయి. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ మందులను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదని సూచిస్తున్నారు. దీన్ని ఎక్కువగా వాడితే వాంతులు, అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. నెబ్యులైజర్ పైపును సరిగ్గా క్లీన్ చెయ్యకపోతే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు/ న్యుమోనియా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
News November 21, 2025
వాట్సాప్ సేవలతో ధాన్యం విక్రయం ఎలా? (1/2)

AP: రాష్ట్రంలో ధాన్యం విక్రయానికి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ధాన్యాన్ని సులభంగా విక్రయించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సేవలను రైతులు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
☛ ధాన్యం అమ్మాలనుకునే రైతులు 7337359375 నంబరుకు HI అని మెసేజ్ పెట్టాలి.
☛ AI ద్వారా ప్రత్యేక వాయిస్ ఈ సేవలను ఎలా వాడుకోవాలో మీకు తెలుపుతుంది.


