News September 29, 2024
హసన్ నస్రల్లా మరణం.. ఒక రోజు ఎన్నికల ప్రచారానికి ముఫ్తీ దూరం

పాలస్తీనా, లెబనాన్కు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంఘీభావం ప్రకటించారు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ఇతర అమరవీరులకు ఆమె సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తాను జమ్మూకశ్మీర్లో ఒకరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో తాము పాలస్తీనా, లెబనాన్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
Similar News
News October 31, 2025
పెళ్లి చేసుకున్న నారా రోహిత్, నటి శిరీష

టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష వివాహం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. AP CM చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్, శిరీష ‘ప్రతినిధి-2’ సినిమాలో జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
News October 31, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 31, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 31, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


