News July 4, 2024
హాథ్రస్: గుండెను పిండేసే 8 ఫొటోలు

UPలోని హాథ్రస్లో 121 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేసింది. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచగా వారి బంధువులు చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. చనిపోయిన తమ వాళ్లను తలుచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపించాయి. కాగా తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఇప్పుడు చిందరవందరగా మారింది. గాయపడిన వారితో ఆసుపత్రుల వార్డులు నిండిపోయాయి. అవన్నీ పై 8 ఫొటోల్లో చూడవచ్చు.
Similar News
News March 18, 2026
ట్రంప్‌ను లేపేస్తానన్నాడు.. అతడినే లేపేశారు!

యుద్ధంలో ఇరాన్ మరో కీలక నేతను కోల్పోయింది. ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీని చంపేశామన్న ఇజ్రాయెల్ <<19410383>>ప్రకటనను <<>>ఇరాన్ తాజాగా ధ్రువీకరించింది. శత్రుదేశం దాడిలో లారిజనీతో పాటు అతడి కొడుకు, సెక్యూరిటీ సిబ్బంది మరణించినట్లు పేర్కొంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అలీ లారిజనీ US, ఇజ్రాయెల్‌కు వార్నింగ్స్ ఇస్తూ వచ్చారు. ట్రంప్‌ను వదిలేదే లేదని, ఆయనను లేపేస్తామంటూ హెచ్చరించారు. ఇంతలో ఆయనే హతమయ్యారు.
News March 18, 2026
రేపే జాబ్ క్యాలెండర్.. భారీగా పోస్టులు!

AP: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. 10వేలకు పైగా పోస్టులతో ఈ క్యాలెండర్‌ను మంత్రి లోకేశ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో DSC, జూనియర్ లెక్చరర్ కలిపి 3 వేల పోస్టులు, వర్సిటీల్లో 1,500 అధ్యాపక పోస్టులు, దాదాపు 600 <<19412398>>గ్రూప్-1, 2<<>> ఉద్యోగాలు, 1,000 కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News March 18, 2026
ఏక పంట విధానం.. అన్నదాతకు నష్టం

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


