News July 9, 2024

హాథ్రస్ తొక్కిసలాటకు కారణమిదే!

image

హాథ్రస్ తొక్కిసలాటకు ఈవెంట్ ఆర్గనైజర్ల నిర్వహణ వైఫల్యమే కారణమని సిట్ తెలిపింది. ‘సత్సంగ్ నిర్వాహకులు అనుమతులు తీసుకున్నా షరతులు పాటించలేదు. ఈ కార్యక్రమానికి ప్రజలను భారీగా ఆహ్వానించి వారికి కనీస ఏర్పాట్లు చేయలేదు. రద్దీ ఎక్కువైనప్పుడు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా పెట్టలేదు. ప్రమాదం జరగ్గానే నిర్వాహకులు పారిపోయారు. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా కొట్టిపారేయలేం’ అని సిట్ తన నివేదికలో పేర్కొంది.

Similar News

News November 17, 2025

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్‌జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది. డిసిప్లినరీ, ACB కేసులు ఉన్నవారు ట్రాన్స్‌ఫర్‌కు అనర్హులని తెలిపింది. ప్రొవిజనల్ సీనియారిటీ, క్లియర్ వేకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారంది. పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలని, శాఖా సెక్రటరీలు ఇంటర్ బదిలీ ఆర్డర్లు ఇస్తారని తెలిపింది.

సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.