News March 30, 2024
పాండ్యపై ద్వేషం సరికాదు: అశ్విన్

రోహిత్ స్థానంలో MI కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పాండ్యపై అభిమానుల ద్వేషం సరికాదని భారత క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్లపై చేసే కామెంట్స్ చూస్తుంటే క్రికెట్లో నెలకొన్న ద్వేషపూరిత వాతావరణం తెలుస్తుంది. గంగూలీ కింద సచిన్ ఆడారు. వారిద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఆ ముగ్గురు కుంబ్లే కెప్టెన్సీలో.. మళ్లీ వాళ్లంతా ధోనీ సారథ్యంలో ఆడారు’ అని అశ్విన్ గుర్తు చేశారు.
Similar News
News December 6, 2025
రాజమండ్రి: విద్యార్థులకు ముఖ్య గమనిక

నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు రాజమండ్రి క్యాంపస్‌లో నిర్వహిస్తున్నామని వీసీ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో ఈ వివరాలు వెల్లడించారు. ఎం.ఏ., ఎం.కామ్, ఎం.పీ.ఈడీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌కు ఈ అడ్మిషన్స్ ఉంటాయని వీసీ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
News December 6, 2025
రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
News December 6, 2025
బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.


