News September 2, 2024
HATS OFF.. మహబూబాబాద్ జిల్లా పోలీస్
భారీ వర్షం ధాటికి మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అయింది. వర్షం దంచి కొట్టడంతో ప్రజలు వణుకుతూ ఇళ్లలోనే తలదాచుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పోలీసులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో ప్రయాణికులకు ఆహారం, మంచినీటిని అందజేసి మానవత్వం చాటుకున్నారు.
Similar News
News September 20, 2024
మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేత
రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.
News September 20, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> JN: మట్కా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు
> WGL: దాడి చేసిన రౌడీ షీటర్ల అరెస్టు
> HNK: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
> MLG: రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష
> MLG: ఎంజీఎం ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన!
> MHBD: అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌కు దేహశుద్ధి!
> WGL: మహిళలకు పలు అంశాలపై అవగాహన సదస్సు
News September 19, 2024
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే చేయండి: కలెక్టర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.