News March 10, 2025
రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్: షామా మహ్మద్

కెప్టెన్ రోహిత్ శర్మపై <<15636348>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ CT విజేత భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 76 పరుగులతో జట్టును ముందుండి నడిపిన హిట్ మ్యాన్కు హ్యాట్సాఫ్ చెప్పారు. శ్రేయస్, రాహుల్ కీలక ఇన్నింగ్సుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని కొనియాడారు.
Similar News
News December 2, 2025
ఏకాంత సేవలో ఆంతర్యం ఏంటంటే?

శ్రీవారి ఆరాధనలో రోజూ రాత్రి జరిగే చివరి సేవను ఏకాంత సేవ (లేదా) పవళింపు సేవ అంటారు. ఈ సేవలో వెండి మంచం, పట్టు పరుపుపై భోగ శ్రీనివాస మూర్తిని వేంచేపు చేస్తారు. స్వామిని నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించి, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి సమర్పిస్తారు. ధనుర్మాసంలో భోగ శ్రీనివాసునికి బదులుగా, కృష్ణ భగవానునికి ఈ ప్రత్యేక ఏకాంత సేవను నిర్వహించడం ఆనవాయితీ. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 2, 2025
గ్లోబల్ సమ్మిట్కు సినీ గ్లామర్

TG: ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి రోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తారు. 2వ రోజున మీడియా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంలో ‘పుష్ప’ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ పాల్గొంటారు. మరికొంతమంది కళాకారులు సమ్మిట్లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.


