News January 26, 2025
HATSOFF: 10th ఫెయిల్ కానీ స్వయంకృషితో విజయం

UPలోని నోయిడాకు చెందిన సరస్వతి భాటీ 10వ తరగతి ఫెయిలయ్యారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. ఆ వెంటనే ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు. కానీ ఏదో సాధించాలన్న పట్టుదల. శానిటరీ న్యాప్కిన్స్ మార్కెట్లో ఎక్కువ ధర ఉంటుండటం, ఊళ్లో మహిళలు బట్ట న్యాప్కిన్లను వాడటం గుర్తించిన ఆమె, స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి ప్యాడ్స్ తయారీ ప్రారంభించారు. ఇప్పుడు నెలకు రూ.30వేల విలువైన ప్యాడ్స్ను అమ్ముతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Similar News
News December 27, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News December 27, 2025
CBN ప్రభుత్వమని గుర్తుంచుకోండి: అనిత

AP: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు. జంతుబలులు చేసి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కుదరదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది CBN ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేతలు చేసేది తప్పని చెప్పలేరా అని మండిపడ్డారు. ఆస్తి కోసం తల్లి, చెల్లెలిపై కేసులు పెట్టించిన వ్యక్తి మీ పిల్లల్ని రక్షిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
News December 27, 2025
రైతు రామారావు ఫ్యామిలీకి అండగా ఉంటాం: CBN

AP: తన సమస్యను చెప్పుకొని గుండెపోటుతో మరణించిన అమరావతి రైతు రామారావు కుటుంబ సభ్యులను CM CBN ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా నిన్న మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో రైతు <<18679475>>రామారావు<<>> ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన మరణించారు.


