News July 31, 2024
HATSOFF: 481 మందిని రక్షించారు

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సానికి ఇప్పటివరకు 150 మంది బలయ్యారు. వందల సంఖ్యలో ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్నవారిని రక్షించడంలో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కీలకంగా వ్యవహరించాయి. నిన్న 481 మందిని ప్రమాదం నుంచి కాపాడాయి. మరో 98 మంది గల్లంతవ్వగా వారి కోసం అన్వేషిస్తున్నాయి. దాదాపు 3వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో 48 గంటల్లోనే 572mm వర్షపాతం నమోదవ్వడం గమనార్హం.
Similar News
News January 15, 2026
ఇరాన్ నో ఫ్లై జోన్.. ఇండిగో విమానం జస్ట్ మిస్!

ప్రభుత్వ వ్యతిరేక ఉద్రిక్తతల మధ్య గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని అకస్మాత్తుగా మూసివేసింది. అయితే జార్జియా నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానం గగనతలం మూతపడటానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే సురక్షితంగా బయటపడింది. ఆ ప్రాంతాన్ని దాటిన చివరి విదేశీ ప్యాసింజర్ విమానం ఇదే కావడం విశేషం. ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఎయిరిండియా సహా పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి.
News January 15, 2026
సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో అప్రెంటిస్ పోస్టులు

ఢిల్లీలోని DRDOకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో 33 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc/BE/BTech/Diploma/ITI/BA/B.Com అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News January 15, 2026
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.


