News October 12, 2024

HATSOFF: పొదల్లో పసిబిడ్డ.. దత్తత తీసుకున్న పోలీసు

image

అది యూపీలోని ఘజియాబాద్. పాపం ఇంకా కళ్లు కూడా తెరవని ఓ పసిగుడ్డును ఎవరో కఠినాత్ములు పొదల్లో వదిలేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ఆ బుజ్జాయిని చూసి చలించిపోయారు. పెళ్లై ఆరేళ్లైనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ చంటిదాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Similar News

News October 13, 2024

పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు ప్రారంభం

image

పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు pminternship.mca.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశాలు కల్పిస్తారు. వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6వేలు, ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. DEC 2 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభిస్తారు.

News October 13, 2024

తిరుమలలో వైభవంగా ధ్వజారోహణం

image

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి మలయప్పస్వామికి తిరుచ్చిపల్లకి సేవ నిర్వహించారు. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇవాళ ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం ఘట్టాన్ని పండితులు నిర్వహించారు. దాదాపు 15 లక్షల మంది బ్రహ్మోత్సవాలకు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు.

News October 13, 2024

అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం

image

AP: కర్నూలు(D) దేవరగట్టులో బన్నీ ఉత్సవానికి( కర్రల సమరం) సర్వం సిద్ధమైంది. మాళమ్మ, మల్లేశ్వరస్వామికి అర్ధరాత్రి 12గంటలకు కళ్యాణం జరిపించిన అనంతరం విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. CCTVలు, డ్రోన్లతో నిఘా, వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.