News July 21, 2024

HATSOFF: పగలు ప్రెసిడెంట్.. రాత్రుళ్లు కాటికాపరి!

image

తమిళనాడుకు చెందిన ఆయన పేరు అరుణాచలం. కాటికాపరి పని వారికి తరతరాల కులవృత్తి. ఇప్పుడాయన మాతూర్ పంచాయతీ అధ్యక్షుడు. అయినా కులవృత్తిని వీడలేదు. పంచాయతీ పెద్దనన్న గర్వంలేదు. పగలు గంజి పెట్టిన ఖద్దరు దుస్తుల్లో ఊరికోసం తపిస్తూ, రాత్రుళ్లు తువ్వాలు భుజాన వేసుకుని కాటికాపరిగా పనిచేస్తున్నారు. అనాథ శవాలకు సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేస్తున్నారు. దీంతో ఆయన పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News October 20, 2025

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

image

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్‌లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.

News October 20, 2025

మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

image

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.

News October 20, 2025

ఇవాళ బిడ్డల ఇళ్లకు పితృదేవతలు!

image

దీపావళి నాడు సాయంత్రం పితృదేవతలు ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారని నమ్మకం. వారికి దారి కనిపించటం కోసమే పిల్లల చేత దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. వీధి గుమ్మం ముందు దివిటీలను వెలిగించి గుండ్రంగా మూడుసార్లు తిప్పి నేలకు కొట్టిస్తూ ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పలికిస్తారు.
* మరిన్ని దీపావళి విశేషాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.