News August 14, 2024

HATSOFF: తానే రంగంలోకి దిగిన హెచ్ఓడీ

image

కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచారం ఘటనలో న్యాయం కోసం అక్కడి డాక్టర్లు నిరనస బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో NRS వైద్య కళాశాలలోని వార్డుల్లో వైద్య సిబ్బంది కరవయ్యారు. రోగులు ఇబ్బంది పడుతుండటంతో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి మిలన్ చక్రవర్తి రంగంలోకి దిగారు. ఓ విభాగాధిపతి అయ్యుండి, ఇంటెర్న్స్ లేదా రెసిడెంట్ వైద్యులు చేసే పనుల్ని తానే చక్కబెడుతున్నారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Similar News

News January 19, 2025

USలో టిక్‌టాక్ బ్యాన్‌కు నేను వ్యతిరేకం.. కానీ: ఎలాన్ మస్క్

image

అమెరికాలో టిక్‌టాక్‌‌ బ్యాన్‌ అంశాన్ని తాను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నానని బిలియనీర్ ఎలాన్ మస్క్ చెప్పారు. అది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమన్నారు. అయితే టిక్‌టాక్‌ను USలోకి అనుమతించినా చైనాలో Xకు ఎంట్రీ ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. కచ్చితంగా మార్పు రావాల్సి ఉందని Xలో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల అమెరికాలో టిక్‌టాక్ సేవలను <<15193540>>నిలిపివేసిన విషయం<<>> తెలిసిందే.

News January 19, 2025

సీజ్‌ఫైర్: హమాస్ చెర నుంచి ముగ్గురు బందీలు విడుదల

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన గాజా కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో బందీల తొలి ఎక్స్ఛేంజీ జరిగింది. తమ చెరలో ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్‌కు హమాస్ అప్పగించింది. ఇందుకు బదులుగా తమ వద్ద ఉన్న 90 మంది పాలస్తీనా ఖైదీలను మరికొన్ని గంటల్లో ఇజ్రాయెల్ రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత దశలో మరో 33 మంది ఇజ్రాయెలీలు హమాస్ చెర నుంచి విముక్తి పొందనున్నారు. బందీల మార్పు ప్రక్రియ 42 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

News January 19, 2025

షకీబ్‌పై అరెస్ట్ వారెంట్

image

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, ఎంపీ షకీబ్ అల్ హసన్‌కు మరో షాక్ తగిలింది. IFIC బ్యాంకుకు సంబంధించి 3 లక్షల డాలర్ల చెక్ బౌన్స్ కేసులో ఢాకా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని సమన్లు ఇచ్చినా షకీబ్ స్పందించకపోవడంతో న్యాయస్థానం చర్యలకు దిగింది. కాగా ఇటీవల అతని బౌలింగ్‌పై ఐసీసీ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాతి నుంచి అతను విదేశాల్లోనే ఉంటున్నారు.