News August 7, 2024

HATSOFF: అవయవ దాతలకు ఆ రాష్ట్రాల గౌరవం

image

తాను లేకపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగపడాలనే ఆలోచన అత్యున్నతమైనది. అలాంటి ఉన్నత మార్గాన్ని ఎంచుకున్నవారికి దక్కే గౌరవం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. అందుకే తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు అవయవ దాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు?

Similar News

News December 3, 2025

ప్రకటనే పవన్ సమాధానమా?

image

తెలంగాణకు పవన్ <<18446578>>క్షమాపణలు<<>> చెప్పాలన్న డిమాండ్ల నేపథ్యంలో జనసేన నుంచి వెలువడిన <<18451648>>ప్రకటన<<>> చర్చనీయాంశమైంది. ఇదే ఆయన సమాధానమా? ప్రత్యేకంగా మాట్లాడరా? ప్రకటనతో వివాదం ముగుస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు Dy.CM హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని రాజకీయ‌వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వివాదానికి ఆయన త్వరగా ముగింపు పలకాలని సూచిస్తున్నారు.

News December 3, 2025

VHTలో ఆడనున్న విరాట్ కోహ్లీ!

image

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (VHT)లో ఆడేందుకు విరాట్ కోహ్లీ అంగీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ధ్రువీకరించారని తెలిపింది. DEC 24 నుంచి జరగనున్న ఈ టోర్నీలో కోహ్లీ 3 మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే ఛాన్సుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆయన ఈ టోర్నీలో ఆడనున్నారు. అటు రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడే అవకాశముంది.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్: ఖర్గేకు సీఎం రేవంత్ ఆహ్వానం

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. సమ్మిట్ ఇన్విటేషన్‌ను అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వారు ఖర్గేతో చర్చించారు.